ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 23 October 2026, 3:20 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం.హన్మకొండలో బైక్ డివైడర్‌ను ఢీకొని బేగంపేట, రామగిరి మండల యువకుడు మృతి.

రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం.హన్మకొండలో బైక్ డివైడర్‌ను ఢీకొని బేగంపేట, రామగిరి మండల యువకుడు మృతి.

అర్జున్ :సమాచారం  అక్టోబర్ 23 .రామగిరి రిపోర్టర్.

హన్మకొండలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో పెద్దపల్లి జిల్లా ,రామగిరి మండలం బేగంపేట గ్రామానికి చెందిన ముత్తే అరవింద్ కళ్యాణ్‌ (32) దుర్మరణం పాలయ్యాడు. బైక్‌పై వెళ్తున్న సమయంలో డివైడర్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. యువకుడి మృతితో స్వగ్రామమైన బేగంపేటలో విషాదఛాయలు అలుముకున్నాయి.

వివరాల్లోకి వెళ్తే.. బేగంపేట గ్రామానికి చెందిన ముత్తే అరవింద్ కళ్యాణ్‌ సాయి ప్రగతి స్కూల్ కరస్పాండెంట్ ముత్తే చంద్రశేఖర్‌ చిన్న కుమారుడు. అరవింద్ హన్మకొండలో ఉంటూ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి బైక్‌పై వెళ్తుండగా ప్రమాదవశాత్తు డివైడర్‌ను ఢీకొన్నట్లు తెలిసింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన మృతి చెందినట్లు సమాచారం.

ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఘటన అనంతరం మృతదేహాన్ని వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించినట్లు తెలిసింది. అక్కడ పోస్టుమార్టం ప్రక్రియ పూర్తయిన తర్వాత మృతదేహాన్ని స్వగ్రామమైన బేగంపేటకు తీసుకురానున్నట్లు సమాచారం.

అరవింద్ కళ్యాణ్‌ మృతివార్తతో కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. చిన్న వయసులోనే యువకుడు మృతి చెందడంతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. కుటుంబానికి అండగా ఉంటాడని భావించిన కుమారుడిని కోల్పోవడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

హన్మకొండలో జరిగిన ఈ ప్రమాదం బేగంపేట గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రమాదానికి గల పూర్తి కారణాలు, ఇతర వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.